ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... రాజ్ కెసిరెడ్డికి బెయిల్ మంజూరు

AP High Court Grants Bail to Raj Kesireddy in Liquor Scam
  • లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి
  • సుమారు ఏడాది కాలంగా జైల్లో ఉంటున్న వైనం
  • గతంలో పలుమార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుమారు ఏడాది కాలంగా జైల్లో ఉన్న ఆయనకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది.


గతేడాది ఏప్రిల్ 25న సిట్ అధికారులు రాజ్ కెసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. గతంలో పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కోర్టు వాటిని తిరస్కరించింది. అయితే, తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.


రాజ్ కెసిరెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణలు: రాష్ట్రంలో మద్యం సరఫరా ప్రక్రియను తన గుప్పిట్లోకి తీసుకోవడం. వివిధ డిస్టిలరీల నుంచి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేయడం. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం.

Advertisement
Raj Kesireddy
AP Liquor Scam
Andhra Pradesh High Court
Liquor Scam Bail
Excise Department
Special Investigation Team SIT
Illegal Liquor
Liquor Mafia

More Telugu News