శబరిమల వివాదం: రంగంలోకి 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. నేటి నుంచి కీలక విచారణ
దేశంలో మత విశ్వాసాలు, ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతను పునర్నిర్వచించే అవకాశమున్న శబరిమల ఆలయ వివాదంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌లు బీవీ నాగరత్న, ఎంఎం సుందరేశ్, అహసానుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, అగస్టీన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి వరాలే, ఆర్ మహదేవన్, జాయ్‌మాల్యా బాగ్చీ సభ్యులుగా ఉన్నారు.
ఈ విచారణ కేవలం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మాత్రమే పరిమితం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కు పరిధి, దానికి సమానత్వం వంటి ఇతర ప్రాథమిక హక్కులతో ఉన్న సంబంధం వంటి విస్తృత అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది. మతపరమైన ఆచారాల్లో న్యాయస్థానాలు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు, "అత్యవసర మతపరమైన ఆచారం" (essential religious practice) అంటే ఏమిటి అనే అంశాలను కూడా తేల్చనుంది.
కేసు నేపథ్యం, ఇతర మతాలపై ప్రభావం
2018 సెప్టెంబర్‌లో, అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ చారిత్రక తీర్పు ఇచ్చింది. భక్తిలో లింగ వివక్షకు తావులేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమీక్ష పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో 2019 నవంబర్‌లో, అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివాదంలో ఇమిడి ఉన్న విస్తృత రాజ్యాంగపరమైన ప్రశ్నలను 9 మంది సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
ఈ విచారణ ఫలితం శబరిమలకే కాకుండా ఇతర మతాల్లోని పలు వివాదాస్పద అంశాలపై కూడా ప్రభావం చూపనుంది. ఇతర మతాల వారిని వివాహం చేసుకున్న పార్శీ మహిళలను అగ్ని దేవాలయాల్లోకి అనుమతించకపోవడం, దావూదీ బోహ్రా వర్గంలో వెలివేత, బహుభార్యత్వం, నికాహ్ హలాలా వంటి ఆచారాల భవిష్యత్తు ఈ తీర్పుపై ఆధారపడి ఉంది.
కేంద్ర, కేరళ ప్రభుత్వాల అనూహ్య వైఖరి
విచారణకు ముందు, కేంద్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా రివ్యూ పిటిషన్లకు మద్దతు ప్రకటించాయి. 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు అయ్యప్ప స్వామి ‘నైష్ఠిక బ్రహ్మచారి’ స్వభావానికి సంబంధించినవే కానీ, మహిళలను అగౌరవపరచడం లేదా అపవిత్రంగా చూడటం కాదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. కేరళ ప్రభుత్వం కూడా ఆలయ సంప్రదాయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదని వాదిస్తూ రివ్యూ పిటిషన్లకు మద్దతు తెలిపింది.
ఏప్రిల్ 22 వరకు పలు దశల్లో వాదనలు జరగనున్నాయి. ముందుగా విస్తృత రాజ్యాంగపరమైన అంశాలపై ధర్మాసనం స్పష్టత ఇచ్చి, ఆ తర్వాత శబరిమల వంటి వ్యక్తిగత కేసులను చిన్న బెంచ్‌లు విచారించే అవకాశం ఉంది.