Bhuvneshwar Kumar: ఇలాంటివి ఒక్కరోజులో సాధ్యం కావు... ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించడంపై భువనేశ్వర్ కుమార్ స్పందన

Bhuvneshwar Kumar Reacts to Creating IPL History
షార్ట్స్‌లో చూడండి
"మైలురాళ్లు అనేవి ఒక్కరోజులో సాధ్యమయ్యేవి కావు. ఏళ్ల తరబడి నిరంతరంగా పడిన శ్రమకు దక్కే ఫలితాలు ఇవి" అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయితో చరిత్ర సృష్టించిన సందర్భంగా అతడు తన అనుభవాలను పంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించడంపై భువనేశ్వర్ సంతోషం వ్యక్తం చేశాడు.

"ఐపీఎల్ నా కెరీర్‌లో ఓ కీలక భాగం. 200 వికెట్లు పడగొట్టడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. నా ఐపీఎల్ ప్రయాణం ఆర్సీబీతోనే మొదలైంది. మళ్లీ ఇక్కడికే తిరిగొచ్చి ఈ ఘనత సాధించడం ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్‌లా అనిపిస్తోంది" అని భువీ తెలిపాడు.

బౌలర్లకు ఆట కఠినంగా మారుతోందని భువనేశ్వర్ అభిప్రాయపడ్డాడు. "కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడం, బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు కొత్త మార్గాలు అన్వేషించడం ముఖ్యం. ఇది బ్యాటర్ల గేమ్ అని అంటుంటారు, కానీ బౌలర్లు కూడా వారికి గట్టి సవాలు విసురుతున్నారని నేను భావిస్తున్నా" అని వివరించాడు.

చెన్నైతో మ్యాచ్ గురించి మాట్లాడుతూ, "ఓ బౌలింగ్ యూనిట్‌గా మేము సమావేశాల్లో చర్చించుకున్న ప్రణాళికలకే కట్టుబడి ఉన్నాం. ప్రత్యర్థులకు అనుగుణంగా సిద్ధమవుతున్న తీరు మాకు మంచి ఫలితాలను ఇస్తోంది" అని భువీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ 41 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి, ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తం 192 ఇన్నింగ్స్‌లలో 202 వికెట్లతో, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.


Go Back to Shorts
Bhuvneshwar Kumar
IPL
Indian Premier League
RCB
Royal Challengers Bangalore
CSK
Chennai Super Kings
200 wickets
fast bowler
cricket

More Telugu News