Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

Harish Rao Angered by CM Revanth Reddy Over Land Issue
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులోని కోహెడ పండ్ల మార్కెట్ భూములపై ముఖ్యమంత్రి కన్నుపడిందని ఆరోపించారు. ఎక్కడైనా భూములు కనిపిస్తే చాలు వాటిని అమ్మివేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్ రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసం కాదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ భూసేకరణలో భాగంగా రూ.10 కోట్లు రైతులకు ఇప్పించామని, కోహెడలో ప్రపంచ అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ కట్టాలని భావించామని తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయలతో డీపీఆర్ తయారు చేశామని, వందేళ్లను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు.
Go Back to Shorts
Revanth Reddy
Harish Rao
Telangana
Koheda Fruit Market
BRS
Sabitha Indra Reddy
Land Acquisition

More Telugu News