Iran: ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి
ఇరాన్‌లో వైమానిక దాడుల కారణంగా 13 మంది మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉన్న బహారెస్థాన్‌లోని ఒక నివాస భవనంపై వైమానిక దాడి జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పైనా దాడులు జరిగినట్లు వెల్లడించింది.
క్యాంపస్ సమీపంలోని సహజవాయువు సరఫరా చేసే పైపులైన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు పంపిణీ కేంద్రం కూడా వైమానిక దాడుల్లో దెబ్బతిందని ఇరాన్ మీడియా నివేదించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ దాడులపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.