Donald Trump: అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విఫలం చేశాం... ఓ విమానం, రెండు హెలికాప్టర్లను కూల్చేశాం: ఇరాన్

Iran Claims Failed US Rescue Operation Shot Down Aircraft
షార్ట్స్‌లో చూడండి
తమ భూభాగంలో అమెరికా చేపట్టిన ఓ రెస్క్యూ ఆపరేషన్‌ను విఫలం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా ఒక సీ-130 రవాణా విమానంతో పాటు రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఇరాన్ రివొల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) సంచలన ప్రకటన చేసింది. అమెరికా చేపట్టిన ఈ చర్య పూర్తిగా విఫలమైందని ఇరాన్ సైనిక కమాండ్ పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.

అయితే, ఈ ఆపరేషన్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైందని, తమ పైలట్‌ను విజయవంతంగా రక్షించుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత శుక్రవారం ఇరాన్ కూల్చివేసిన తమ ఎఫ్-15ఈ యుద్ధ విమానంలో తప్పిపోయిన రెండో పైలట్‌ను (కల్నల్ ర్యాంక్ అధికారి) సురక్షితంగా కాపాడినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఒక్క అమెరికా సైనికుడు కూడా గాయపడలేదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు.

శుక్రవారం నాడు మధ్య ఇరాన్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిపోయింది. అందులోని ఇద్దరు పైలట్లలో ఒకరిని వెంటనే రక్షించగా, రెండో పైలట్ కోసం అమెరికా ప్రత్యేక దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్ చెబుతోంది. ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో శత్రు విమానాలు మంటల్లో కాలిపోతున్నాయని ఇరాన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ డ్రోన్‌ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇదే సమయంలో మరో అమెరికా యుద్ధ విమానం ఏ-10ను కూడా కూల్చినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.
Go Back to Shorts
Donald Trump
Iran
US Rescue Operation
C-130 Plane
Black Hawk Helicopters
Iran Revolutionary Guards
F-15E fighter jet
Isfahan Province
US Military
Middle East tensions

More Telugu News