India: గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు
గల్ఫ్ ప్రాంతం నుంచి భారత్‌కు విమాన సర్వీసుల పరిస్థితి మెరుగుపడుతోంది. ఆదివారం ఒక్కరోజే యూఏఈ నుంచి 90 ప్రత్యేక విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయని అధికారిక ప్రకటన వెల్లడించింది. సౌదీ అరేబియా, ఒమన్ నుంచి కూడా విమానాలు నడుస్తున్నాయి. ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, అక్కడి నుంచి 8 నుంచి 10 విమానాలు వచ్చే అవకాశం ఉంది.
కువైట్, బహ్రెయిన్ దేశాల్లో గగనతలాలను మూసివేసినప్పటికీ, సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా, ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా, ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరాన్ నుంచి ప్రయాణాలను అర్మేనియా, అజర్‌బైజాన్ ద్వారా సులభతరం చేస్తున్నారు.
ఇటీవల ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో మరణించిన భారత నావికుడి పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చారు. ఆయన కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, ఇరాన్‌లో చిక్కుకుపోయిన 345 మంది భారత జాలర్లు శనివారం సురక్షితంగా చెన్నైకి చేరుకున్నారు.
గల్ఫ్, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. భారతీయుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను, 24 గంటల హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థులు, నౌక సిబ్బందికి కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.