ఆర్డర్ పెడితే ఫుడ్ రాదు.. అయినా ఈ వెబ్‌సైట్స్‌పై యువతకు ఎందుకింత మోజు?
- యువతను ఆకట్టుకుంటున్న ఫుడ్ రాని వెబ్‌సైట్లు
- దక్షిణ కొరియాలో వైరల్‌గా మారిన ‘యుమ్‌సిక్‌మాన్ అన్వాయో’ సైట్
- ఆర్డర్ చివర్లో ఆదా చేసిన డబ్బు, క్యాలరీలు చూపిస్తుంది
- వేగంగా పెరుగుతున్న ఇలాంటి డోపమైన్ వెబ్‌సైట్లు
- ఖర్చు లేకుండా సంతృప్తి పొందాలనే కోరికే కారణమని నిపుణుల అభిప్రాయం
ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ చేయడం సహజం. కానీ ఆర్డర్ పెట్టిన భోజనం అసలు రాదని ముందే తెలిసినా అదే పని చేస్తే? వినడానికి విచిత్రంగా అనిపించినా ఇప్పుడు చాలామంది యువత ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా జనరేషన్ Zలో ఈ కొత్త ట్రెండ్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. డబ్బు ఖర్చు చేయకుండా, ఏమీ కొనకుండా, కేవలం ఆర్డర్ పెట్టిన అనుభూతి కోసం ప్రత్యేక వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్నారు.
అనుభూతి మాత్రమే
దక్షిణ కొరియాకు చెందిన ‘యుమ్‌సిక్‌మాన్ అన్వాయో’ అనే వెబ్‌సైట్ ఈ ట్రెండ్‌కు నాంది పలికింది. దీని అర్థం సుమారుగా ‘ఫుడ్ మాత్రమే రాదు’ అని. ఇది సాధారణ ఫుడ్ డెలివరీ యాప్‌లాగే కనిపిస్తుంది. రెస్టారెంట్‌ను ఎంచుకోవచ్చు. నచ్చిన వంటకాలను కార్ట్‌లో వేసుకోవచ్చు. చెల్లింపు విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. డెలివరీ బాయ్ మ్యాప్‌లో వస్తున్నట్లు కూడా చూపిస్తుంది. చివరకు ‘డెలివరీ పూర్తయింది’ అనే సందేశం వస్తుంది. కానీ నిజానికి ఎలాంటి ఫుడ్ తయారు కాదు. ఎలాంటి డెలివరీ కూడా జరగదు.
చివర్లో కనిపించేది ఇదే
ఆర్డర్ ప్రక్రియ పూర్తయ్యాక ఈ వెబ్‌సైట్ ఒక ఆసక్తికర సందేశాన్ని చూపిస్తుంది. నిజంగా ఆర్డర్ పెట్టి ఉంటే ఎంత డబ్బు ఖర్చయ్యేదో, ఎన్ని క్యాలరీలు తీసుకునేవారో తెలియజేస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్‌ను పదేపదే తెరిచి చివరికి ఆర్డర్ పెట్టకుండా మూసేసే అలవాటు నుంచి ఈ ఆలోచన వచ్చిందని వెబ్‌సైట్ రూపకర్త గతంలో తెలిపాడు. మొదట సరదాగా ప్రారంభించినా తర్వాత చాలా మందికి ఇది ఒత్తిడి తగ్గించే మార్గంగా మారిందని చెప్పాడు.
ఇవి ఫుడ్‌కే పరిమితం కావు
ఇలాంటి ‘డోపమైన్ వెబ్‌సైట్లు’ ఇప్పుడు మరెన్నో వచ్చాయి. కొన్ని వెబ్‌సైట్లలో వర్చువల్‌గా సిగరెట్ కాల్చొచ్చు. మరికొన్నింటిలో ఎంత ఖరీదైన వస్తువులైనా షాపింగ్ కార్ట్‌లో వేసుకోవచ్చు. కానీ చివరకు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వస్తువులు కూడా రావు. అయినా స్క్రోలింగ్, ఎంపిక, ఆర్డర్ చేసిన అనుభూతి మాత్రం వినియోగదారులకు దక్కుతుంది.
యువత ఎందుకు ఇష్టపడుతోంది?
జంగ్‌వాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కిమ్ హియోన్-సిక్ అభిప్రాయం ప్రకారం ఈ ట్రెండ్ దక్షిణ కొరియాలో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ‘ముక్‌బాంగ్’ సంస్కృతిని గుర్తు చేస్తోంది. నిజంగా చేయకుండానే చేసిన అనుభూతిని పొందాలనే కోరిక యువతలో పెరుగుతోందని ఆయన చెప్పారు. భవిష్యత్తుపై అనిశ్చితి, మానసిక అలసట పెరుగుతున్న ఈ కాలంలో పెద్దగా బాధ్యతలు లేకుండానే కొంత ఉపశమనం పొందాలని చాలామంది కోరుకుంటున్నారని వివరించారు. అదే ఈ తరహా వెబ్‌సైట్ల ఆదరణకు కారణమవుతోందని అభిప్రాయపడ్డారు.