Akasa Air: విమాన సేవలను పునఃప్రారంభించడంపై ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలతో పాటు వివిధ దేశాలకు విమానాల రద్దు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన చేసింది. అబుదాబికి తమ విమాన సేవలను దశలవారీగా తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అనుకూలమైన పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. దోహా, రియాద్, కువైట్ ప్రాంతాలకు మాత్రం విమానాల రాకపోకల నిలిపివేత ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుందని తెలిపింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ లైన్స్ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి, కోజికోడ్ ప్రాంతాలకు విమాన సేవలను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని వెల్లడించింది.