Infosys: ఇన్ఫోసిస్ పేరుతో రూ.6.3 కోట్లు దోచుకున్న ఘరానా మోసగాళ్లు
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు చెందిన సీఎస్ఆర్ అధికారులుగా నమ్మబలికి, మర్కంటైల్ అనే కంపెనీ నుంచి రూ.6.3 కోట్లు దోచుకున్న సంఘటన మైసూర్‌లో వెలుగు చూసింది. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో మైసూరు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబందించి పోలీసులు గగన్, నీలాద్రి, ప్రసాద్ మిశ్రా, జె. హర్ష అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
కంపెనీ ప్రతినిధులకు గగన్ మొదట ఫోన్ చేసి ఇన్ఫోసిస్ ప్రాంతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యతల విభాగం అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. మర్కంటైల్ కంపెనీ నిర్వహిస్తున్న 'హెగ్గుంజే రాజీవ్ శెట్టి ఛారిటబుల్ ట్రస్ట్'కు కోట్లాది రూపాయల నిధులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. మంగళూరు, ఉడిపిలలో ఆ కంపెనీ నిర్వహిస్తున్న ట్రస్టు కార్యకలాపాలను పరిశీలిస్తామని చెప్పాడు.
నిపుణుల పేరుతో కొంతమంది అనుచరులను పంపించాడు. ట్రస్టులకు నిధులు ఇస్తామని, అయితే అంతకుముందు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించాడు. దశలవారీగా వివిధ రూపాల్లో రూ.6.3 కోట్లు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత మర్కంటైల్ కంపెనీ నిర్వహిస్తున్న ట్రస్టులు, ఆరోగ్య కేంద్రాలకు రూ.178 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు గత సంవత్సరం అక్టోబర్‌లో ఒక పత్రాన్ని సృష్టించారు. దానిని నిజమని నమ్మిన మర్కంటైల్ ప్రతినిధులు నగదు ఇచ్చారు. అయితే నెలలు గడిచినా నిధులు సంస్థ ఖాతాల్లోకి రాకపోవడంతో మోసపోయామని గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.