NASA: అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...!
మానవుడి అంతరిక్ష యాత్రలు సుదీర్ఘంగా మారుతున్న కొద్దీ, వ్యోమగాముల మధ్య సాన్నిహిత్యం అనే అంశంపై శాస్త్రీయంగా సీరియస్ చర్చ జరుగుతోంది. "అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా?" అనే ప్రశ్న వినడానికి ఆసక్తికరంగా ఉన్నా, ఇది ఇప్పుడు వైద్య, భౌతిక, మానసిక సవాళ్లతో కూడిన క్లిష్టమైన సమస్యగా మారింది.
నాసా వైఖరి ఏంటి?
ఇప్పటివరకు అంతరిక్షంలో లైంగిక సంబంధాలు ఏర్పడినట్టు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. దీనిని స్పష్టంగా నిషేధిస్తూ నాసా వద్ద లిఖితపూర్వక నియమాలు కూడా లేవు. అయితే, వ్యక్తిగత ప్రవర్తన విషయంలో కఠినమైన నిబంధనల కంటే వృత్తిపరమైన ప్రమాణాలు, వ్యోమగాముల మంచి నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తామని నాసా అధికారులు చెబుతున్నారు. కానీ, గర్భధారణను మాత్రం కచ్చితంగా నిషేధించారు. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ప్రభావం, శరీరంలోని ద్రవాల్లో మార్పులు వంటివి తల్లి, బిడ్డ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. "మేము వృత్తి నిపుణులం. మిషన్ వాతావరణంలో ఇలాంటి వాటికి తావులేదు" అని మాజీ ఐఎస్ఎస్ కమాండర్ అలాన్ పాయిండెక్స్ టర్ స్పష్టం చేశారు.
భౌతిక సవాళ్లు, గోప్యత సమస్య
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడంతో న్యూటన్ మూడో నియమం ప్రకారం, ఏ చిన్న చర్యకైనా వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. అంటే, ఇద్దరు వ్యక్తులు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తే, ఒకరినొకరు నెట్టుకుని దూరంగా వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు, అంతరిక్ష నౌకలో గోప్యత దాదాపు శూన్యం. ప్రతి కదలిక, శబ్దం అందరికీ తెలుస్తుంది. నిరంతర ప్రయోగాలు, నిర్వహణ పనులతో వ్యోమగాములకు వ్యక్తిగత సమయం కూడా ఉండదు.
పరిశోధనలు, ప్రయోగాలు
ఈ సవాళ్లను అధిగమించేందుకు 'స్పేస్ సెక్సాలజీ' అనే కొత్త పరిశోధన రంగం పుట్టుకొచ్చింది. ఇందులో భాగంగా రూపొందించిన '2Suit' అనే ప్రత్యేక డ్రెస్ ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు అతుక్కుని ఉండేందుకు సాయపడ్డా, అది కూడా అంత సులభం కాదని తేలింది. 2015లో పోర్న్‌హబ్ సంస్థ అంతరిక్షంలో సినిమా తీస్తామని ప్రకటించినా, నిధుల కొరతతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
మొత్తం మీద, సైద్ధాంతికంగా సాధ్యమైనప్పటికీ, భౌతిక సవాళ్లు, ఆరోగ్య ప్రమాదాలు, గోప్యత లేకపోవడం వంటి కారణాల వల్ల అంతరిక్షంలో శృంగారం ప్రస్తుతానికి అసాధ్యమనే చెప్పాలి.