IAS Officer Son: ఐఏఎస్ అధికారిణి కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్...! తనకు నెగెటివ్ వచ్చిందన్న హేమ

హైదరాబాద్‌లోని కొండాపూర్ క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ కలకలం చెలరేగింది. 64 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి గంజాయి పాటిజివ్, ఇద్దరికి డ్రగ్స్ పాటిజివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ఎనిమిది మందిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు కూడా ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. క్వాక్ ఎరీనా పబ్ డ్రగ్ కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

క్వాక్ ఎరీనా క్లబ్‌లో 'బ్లాక్ కాఫీ' పేరిట ఈవెంట్ జరిగింది. ఈవెంట్‌లో దాదాపు 1,500 మంది పాల్గొన్నారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన ఈగల్ టీమ్ అధికారులు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. 'బ్లాక్ కాఫీ' ఈవెంట్ జరుగుతున్న చోటుకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది.

నటి హేమకు నెగిటివ్

క్వాక్ ఎరీనా క్లబ్ పబ్‌ ఈవెంట్ లో ప్రముఖ సినీ నటి హేమ కూడా పాల్గొన్నారు. పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. తనకు డ్రగ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు నిర్ధారించిన కిట్‌ను ఆమె చూపిస్తూ వీడియో విడుదల చేశారు.
IAS Officer Son
Hyderabad Drugs Case
Kondapur Quack Arena Pub
Hema Actress

More Telugu News