Telangana Weather: తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడవచ్చని, ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Telangana Weather
Telangana rains
Hyderabad Meteorological Center
Rain alert
IMD
Weather forecast

More Telugu News