Raja Ravi Varma: రూ.167 కోట్లు పలికిన రాజా రవివర్మ 'యశోదకృష్ణ' పెయింటింగ్.. కొనుగోలు చేసిన సైరస్ పూనావాలా

Raja Ravi Varmas Yashoda Krishna Painting Sold for 167 Crore
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్నికృష్ణుడి పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడుపోయింది. ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ నిర్వహించగా, రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకునేందుకు చాలామంది పోటీపడ్డారు. చివరకు దీనిని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు.

రాజా రవివర్మ ఈ ఆయిల్ పెయింటింగ్‌ను 1890లలో గీశారు. వేలంలో రూ.167 కోట్లు పలకడంతో అత్యంత ఖరీదైన ఆధునిక భారతీయ కళాఖండంగా యశోద, కృష్ణ చిత్రం నిలిచింది. గత సంవత్సరం ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. దీనిని ఢిల్లీకి చెందిన కిరణ్ నాదర్‌ దక్కించుకున్నారు.

పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని, ఇది తన బాధ్యత అని సైరస్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇది జాతీయ సంపద అని, దీనిని క్రమంగా ప్రజల వీక్షణ కోసం అందుబాటులో ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Raja Ravi Varma
Yashoda Krishna Painting
Saffronart Auction
Cyrus Poonawalla
Serum Institute of India

More Telugu News