Bhanu Chander Reddy: బెంగళూరులో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్యలో కొత్త కోణాలు
బెంగళూరులో తెలంగాణకు చెందిన టెక్కీ దంపతుల ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వారి ఆత్మహత్యకు మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు కారణం కావొచ్చని కూడా తెలుస్తోంది. అదే సమయంలో 'ఏఐ' కారణంగా ఉద్యోగం కోల్పోవడం వారిని మరింత ఆందోళనకు గురి చేసిందని తెలుస్తోంది.
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బానుచందర్ రెడ్డి సోమవారం తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత కొద్దిసేపటికే, ఐబీఎంలో టెక్కీగా పనిచేస్తున్న అతని భార్య షాజియా, వారు నివసిస్తున్న భవనంలోని 17వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి.
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత, భానుచందర్ రెడ్డి దాదాపు ఏడాదిగా బెంగళూరులో ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగాల కోతలో భాగంగా భానుచందర్ రెడ్డిని ఆయన కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో అతడికి స్థిరమైన ఆదాయం లేకుండాపోయింది.
చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని, దానితో పాటు ఆర్థిక ఇబ్బందులు అతనిని ఆందోళనకు గురి చేశాయని తెలుస్తోంది. మతాంతర వివాహం కారణంగా భానుచందర్ రెడ్డి కుటుంబం అతనిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. వారి మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.