Addeti Yedukondalu: ఒక్కడు... 27 బైకులు చోరీ చేశాడు!

Prakasam Police Arrest Addeti Yedukondalu Recover 27 Stolen Bikes
షార్ట్స్‌లో చూడండి
ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 27 బైకులను ఒక్కడే చోరీ చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగగా మారిన ఓ వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 27 మోటార్‌సైకిళ్లను, కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం మధ్యాహ్నం ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి మామిడిపాలెం సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన అద్దేటి ఏడుకొండలు (35) అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని ఆపి తనిఖీ చేయగా, దొంగిలించిన బైక్‌తో పాటు 1.175 కిలోల గంజాయి లభించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.

చెడు వ్యసనాలకు డబ్బు అవసరం కావడంతో బైక్ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నట్లు ఏడుకొండలు అంగీకరించాడు. ఒంగోలు, మద్దిపాడు, అద్దంకి, వినుకొండ, గుంటూరు, నరసరావుపేట, జి.కొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 27 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారం మేరకు పోలీసులు ఆయా బైకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.12 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై గతంలోనూ ఒంగోలు, గుంటూరులో పలు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, సీఐ నాగరాజుతో పాటు ప్రత్యేక బృందంలోని సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, పక్కా ప్రణాళికతో నిందితుడిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
Go Back to Shorts
Addeti Yedukondalu
bike thief
bike theft
Prakasam district
Ongole
Guntur
ganja
narcotics
crime news
Andhra Pradesh police

More Telugu News