8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటు.. జీతాలు భారీగా పెరిగే ఛాన్స్!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘాన్ని (8th Central Pay Commission) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన సిఫార్సులను సమర్పించేందుకు 18 నెలల గడువు విధించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల సవరణకు మార్గం సుగమమైంది. కొత్త వేతనాలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో అధికారికంగా ధృవీకరించారు. 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. జీతాలు, అలవెన్సులు, పెన్షన్ నిర్మాణం వంటి పలు అంశాలపై ఈ కమిషన్ సమీక్షించి, 18 నెలల్లోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందని వివరించారు. నివేదిక రావడానికి 2027 మధ్యకాలం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, గత సంప్రదాయం ప్రకారం 2026 జనవరి 1 నుంచే బకాయిలతో సహా కొత్త జీతాలను వర్తింపజేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌దే కీలక పాత్ర
ఈ వేతన సవరణలో 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అత్యంత కీలకం కానుంది. ఉద్యోగులందరి మూల వేతనాన్ని (Basic Pay) ఒకేసారి పెంచడానికి ఈ గుణకాన్నే ఉపయోగిస్తారు. 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేయగా, దానిని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో అప్పుడు కనీస మూల వేతనం రూ. 7,000 నుంచి రూ. 18,000కు పెరిగింది. గరిష్ఠ వేతనం రూ. 2.5 లక్షలకు చేరింది.
ఒకవేళ 8వ వేతన సంఘం కూడా ఇదే 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కొనసాగిస్తే, ప్రస్తుతం రూ. 18,000గా ఉన్న కనీస మూల వేతనం సుమారు రూ. 46,000కు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఉద్యోగుల ఆకాంక్షలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మధ్య సమతుల్యం సాధించాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగియడంతో ఈ కొత్త కమిషన్‌ను నియమించారు. మూల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు, ప్రస్తుతం 3 శాతంగా ఉన్న వార్షిక ఇంక్రిమెంట్లు, పెన్షన్ విధానంపైనా ఈ కమిషన్ తన సిఫార్సులను అందించనుంది. కమిషన్ నివేదిక, ప్రభుత్వ ఆమోదం తర్వాతే జీతాలు ఎంతమేర పెరుగుతాయనే దానిపై పూర్తి స్పష్టత రానుంది.