Vijayawada bus fire: విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్‌బీఎస్) సమీపంలో ఈరోజు తెల్లవారుజామున పెను ప్రమాదం తృటిలో తప్పింది. సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
రావులపాలెం నుంచి హైదరాబాద్‌కు సాయి ఆర్కే ట్రావెల్స్‌కు చెందిన బస్సు బయలుదేరింది. విజయవాడ బస్టాండ్ ఎదురుగా రాగానే ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికులను త్వరగా కిందకు దిగాలని హెచ్చరించారు. దీంతో వారంతా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రయాణికులు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు బ్యాటరీ టెర్మినల్స్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అప్పటికే బస్సు లోపలి భాగం పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బస్సు యజమానిని, డ్రైవర్‌ను విచారిస్తున్నారు.