Donald Trump: క్యూబాకు రష్యా చమురు నౌక... అనుమతిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
క్యూబాకు వెళ్లే రష్యా చమురు నౌకను అనుమతిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్యూబాకు చమురు రవాణాపై కొంతకాలంగా అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ట్రంప్ ఈ ఆంక్షలను సడలించారు. 7.3 లక్షల బ్యారెళ్ల ముడిచమురుతో రష్యా నౌక 'అనాటోలీ కొలోడ్కిన్' మార్చి 8న రష్యా పోర్ట్ నుంచి బయలుదేరింది. ఇంగ్లీష్ ఛానల్ మీదుగా అట్లాంటిక్ చేరుకుంది.
అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ నౌక క్యూబా చేరడంపై ఇప్పటి వరకు సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ట్రంప్ స్పందిస్తూ, క్యూబాకు చమురు చేరవేయాలని ఏ దేశం అనుకుంటుందో దానితో తమకు సమస్య లేదని, అది రష్యా అయినా, మరే దేశమైనా ఇబ్బంది లేదని అన్నారు. ఎందుకంటే క్యూబా ప్రభుత్వం త్వరలో నేలకూలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతలోనే అమెరికా నుంచి మరొక ప్రకటన వచ్చింది. రష్యా చమురు నౌకను అనుమతిస్తున్నట్లు తెలిపింది.
కాగా, ఈ చమురు నౌక మంగళవారం క్యూబాకు చేరుకునే అవకాశం ఉంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆ దేశానికి చమురు రవాణా నిలిచిపోయింది. వెనెజువెలాకు చమురు చేరవేసే దేశాలపై అధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో, ఆ తర్వాత తమ లక్ష్యం క్యూబా అని కూడా ఇటీవల ట్రంప్ ప్రకటించారు.