Vangalapudi Anita: టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేసిన హోంమంత్రి అనిత
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పార్టీ కార్యకర్తలపై తనకున్న గౌరవాన్ని వినూత్నంగా ప్రదర్శించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెదబోదుగల్లంలో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె సీనియర్ కార్యకర్తల కాళ్లకు నమస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీనే నమ్ముకుని సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు సీనియర్ కార్యకర్తలను ఈ సమావేశంలో గుర్తించి మంత్రి అనిత సత్కరించారు. అనంతరం వారికి పాదాభివందనం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన తిరుగులేని విజయం వెనుక కార్యకర్తల అంతులేని కృషి, పట్టుదల ఉన్నాయని కొనియాడారు. కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని మంత్రి అనిత వ్యాఖ్యానించారు.