Manikonda Apartment Fire: మణికొండ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం

Manikonda Apartment Fire Major Fire Accident Averted in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలోని మణికొండలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే భవనం ఖాళీ చేసి రోడ్లపైకి పరుగులు తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. రోడ్ నెంబర్ 25లోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ ఫ్లాట్ నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడం స్థానికులు గమనించారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల ఫ్లాట్ల వారు కూడా అప్రమత్తమై బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంలో నమూనాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
 
Go Back to Shorts
Manikonda Apartment Fire
Hyderabad fire accident
Alkapur Township
Apartment fire
Fire accident
Short circuit
Fire Department
Telangana News
Building fire
Property damage

More Telugu News