TTD: ఒంటిమిట్టకు 85 వేల లడ్డూలు పంపిన టీటీడీ
కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ తరలించింది. కల్యాణానికి హాజరయ్యే భక్తులకు పంపిణీ చేసేందుకు మొత్తం 85 వేల లడ్డూలను ఆదివారం ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఒంటిమిట్టకు పంపించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్, డిప్యూటీ ఈఓ (పరకామణి) వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్యాకింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. దాదాపు 200 మందికి పైగా మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఈ లడ్డూలను ప్రత్యేక వాహనాల్లో ఒంటిమిట్టకు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్టేట్స్ ఆఫీసర్ మాట్లాడుతూ.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరిల ఆదేశాల మేరకు కేవలం ఐదు గంటల్లోనే 85 వేల లడ్డూలను ప్యాక్ చేసి, ఒంటిమిట్టకు సకాలంలో చేరేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవాసదన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.