Vijay Thalapathy: టీవీకే పార్టీ యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట రాజు... పరిచయం చేసిన హీరో విజయ్

ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల కోసం యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తోట రాజును తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల విడుదల చేసిన అధికారిక జాబితాలో తోట రాజు పేరును ఖరారు చేశారు.

పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లోనూ టీవీకే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగా అభ్యర్థులను నిలబెట్టడంతో, ఈ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటములతో పాటు టీవీకే మధ్య త్రిముఖ పోరుగా మారాయి.

అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు, 2026 ఫిబ్రవరిలో తోట రాజును యానాం నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పార్టీ నియమించింది. యానాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పోటీలో ఉన్నారు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Vijay Thalapathy
TVK Party
Tamilaga Vetri Kazhagam
Thota Raju
Yanam Constituency
Puducherry Elections
Assembly Elections 2024
Gollapalli Srinivas Ashok
Congress Party

More Telugu News