Virat Kohli: ఛేజింగ్ లో కోహ్లీ క్లాస్, పడిక్కల్ మాస్... తొలి మ్యాచ్‌లో ఓడిన సన్ రైజర్స్
ఐపీఎల్ 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి, టోర్నీలో శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో పాటు దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్‌ల విధ్వంసకర బ్యాటింగ్ ముందు సన్‌రైజర్స్ బౌలర్లు తేలిపోయారు.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (8) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ సృష్టించిన విధ్వంసం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించి సన్‌రైజర్స్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
పడిక్కల్ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ రజత్ పటీదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తన వంతు మెరుపులు మెరిపించి విజయాన్ని మరింత చేరువ చేశాడు. ఒకే ఓవర్లో పటీదార్, జితేష్ శర్మ (0) ఔటైనా, మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చివరి వరకు నిలిచి టిమ్ డేవిడ్ (16 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సన్‌రైజర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్ రెండు వికెట్లు తీసినప్పటికీ, మిగతా వారెవరూ భారీ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.
అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టుకు ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (11), అభిషేక్ శర్మ (7) వికెట్లను త్వరగా కోల్పోవడంతో 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (31)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇషాన్ ఔటైన తర్వాత, చివర్లో యువ ఆటగాడు అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటగలిగింది.
ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లతో సత్తా చాటాడు. రొమారియో షెపర్డ్ 54 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.