Houthi: నెల రోజుల అనంతరం, ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పైకి హూతీల క్షిపణి దాడి

Houthi Missile Attack on Israel After a Month of Conflict
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన నెల రోజుల తర్వాత, ఇరాన్‌కు మద్దతుగా ఉండే యెమెన్ హూతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మొదటిసారి దాడి చేశారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఓ వైపు దాడులు, మరోవైపు కాల్పుల విరమణకు సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఈ కీలకపరిణామం చోటుచేసుకుంది. హూతీలు మొదటిసారి కదనరంగంలోకి దిగారు.

ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా వారు క్షిపణి దాడులు నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై దాడులు చేసినట్లు హూతీల ప్రతినిధి యాహ్యా సారె ధృవీకరించారు.

యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని గుర్తించి, దాడిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణిని అడ్డుకున్నాయని వెల్లడించింది. హూతీల దాడితో ప్రాణ, ఆస్తి నష్టం కలిగినట్లు తెలియరాలేదు. యుద్ధంలోకి హూతీలు రావడం చమురు మార్కెట్‌కు ఆందోళన కలిగించే అంశం.

గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో హూతీలు క్రియాశీలకంగా వ్యవహరించారు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మార్గంలో వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. అయితే నెల రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ హూతీలు కనిపించలేదు. తాజా దాడి చర్చకు దారితీసింది.
Go Back to Shorts
Houthi
Israel
Yemen Houthi
Iran
Missile attack
Red Sea
Gaza
Middle East conflict

More Telugu News