R Parthiban: నో క్యాస్ట్ నో రెలిజియన్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న తమిళ దర్శకనటుడు

Actor R Parthiban seeks no caste certificate after controversy
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు కులం, మతం లేదని అధికారికంగా ధ్రువీకరించే సర్టిఫికెట్ కోసం చెన్నైలో దరఖాస్తు చేశారు. ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో తన కులాన్ని ప్రస్తావించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిన్న ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు తనను తీవ్రంగా బాధించాయని, తనకు నిజంగా కులం, మతంపై నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్టిఫికెట్ పొందితే, సినీ పరిశ్రమలో ఇలాంటి ధ్రువపత్రం అందుకున్న తొలి వ్యక్తిని తానే అవుతానని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రచార కార్యక్రమంలో పార్తిబన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనను తాను ‘నేను రాధాకృష్ణన్ పార్తిబన్, ఒక నాయుడు అబ్బాయిని’ అని పరిచయం చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో, అది పొరపాటున నోరు జారి వచ్చిన మాట అని పేర్కొంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు క్షమాపణలు చెప్పారు.
 
Go Back to Shorts
R Parthiban
R Parthiban caste certificate
No caste no religion certificate
Tamil actor director
Ustaad Bhagat Singh
Radhakrishnan Parthiban
Chennai
Tamil Nadu

More Telugu News