Annamalai: తమిళనాడులో సీట్ల పంపకాలపై అన్నామలై అసంతృప్తి... అధిష్ఠానానికి లేఖ!

Annamalai Displeased with Seat Sharing in Tamil Nadu Writes Letter to High Command
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలపై రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు! సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల పైనా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

బీజేపీకి సులువుగా విజయం లభించే కినతుకడవుతో సహా పలు నియోజకవర్గాలను అన్నాడీఎంకేకు కేటాయించడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని అన్నామలై పార్టీ నాయకత్వానికి తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఆయా నియోజకవర్గాల్లోని బీజేపీ కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కినాతుకడవులో బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంవద్ద ఆందోళన చేపట్టారు. తమిళనాడు 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఎన్డీయేలో పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 169 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కూటమిలోని ఇతర పార్టీలు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లు దక్కాయి.
Go Back to Shorts
Annamalai
Tamil Nadu
BJP
AIADMK
Seat Sharing
Assembly Elections
Kinathukadavu
NDA Alliance

More Telugu News