పీఎస్ఎల్‌లో వింత.. రంగు మారిన బంతి.. నాసిరకం జెర్సీలతో నవ్వులపాలు!
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ ఆరంభం రోజునే ఒక విచిత్రమైన సంఘటనతో వార్తల్లో నిలిచింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో తెల్లటి క్రికెట్ బంతి గులాబీ రంగులోకి మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనతో లీగ్ నాణ్యతపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు, సెటైర్లు వెల్లువెత్తాయి.
ఆట మధ్యలో ఫీల్డర్లు బంతి మెరుపును కాపాడేందుకు తమ దుస్తులకు రుద్దుతున్నప్పుడు ఈ సమస్య తలెత్తింది. హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాళ్ల జెర్సీలకు వాడిన నాసిరకం మెరూన్ రంగు, తెల్లటి బంతికి అంటుకుంది. దీంతో కొద్దిసేపటికే బంతి పింక్‌గా మారిపోయింది. ఈ దృశ్యాలకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మీమ్స్, జోకులతో విరుచుకుపడ్డారు.
ఈ ఘటనపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యంగ్యంగా స్పందించాడు. "హైదరాబాద్ కింగ్స్‌మెన్ తమ కిట్లకు స్థానికంగా ఉండే దుపట్టా రంగుల షాపులో రంగు వేయించుకున్నట్లుంది. అక్కడ తక్కువ ధరకే తెల్ల బట్టలకు రంగులు వేసి ఇస్తారు" అంటూ ఎగతాళి చేశాడు.
అభిమానులు కూడా తీవ్రంగా స్పందించారు. "అంతర్జాతీయ లీగ్‌లో ఆడుతున్నారా? లేక గల్లీ క్రికెట్ ప్రయోగం చేస్తున్నారా?", "డబ్బులన్నీ జట్టును కొనడానికే సరిపోయినట్లున్నాయి" అంటూ కామెంట్లు చేశారు. ఒక అభిమాని అయితే, ఈ రంగు ఆటగాళ్ల చర్మానికి అంటితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ ట్రోలింగ్‌పై హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ కూడా సరదాగా స్పందించింది. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, తమ ప్రత్యర్థి లాహోర్ ఖలందర్స్‌కు అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. "పీఎస్ఎల్‌లో జరిగిన తొలి 'పింక్-బాల్ గేమ్'లో గెలిచినందుకు ప్రత్యర్థి జట్టుకు అభినందనలు" అంటూ సెటైరికల్‌గా పేర్కొంది.
ఇదిలా ఉంటే... మ్యాచ్ ప్రసార నాణ్యతపై కూడా ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 4కే రిజల్యూషన్ అని ప్రచారం చేసినప్పటికీ, కెమెరాలు షేక్ అవ్వడం, దృశ్యాలు మసకగా కనిపించడం వంటి సమస్యలు తలెత్తాయి. ఆడియో, వీడియో సింక్ కాలేదని చాలామంది ఫిర్యాదు చేశారు. "పేలవమైన కెమెరా వర్క్, బలహీనమైన బ్రాండింగ్, నాసిరకం ఆడియో ప్రొడక్షన్‌తో అభిమానులకు నిరాశే మిగిలింది. మేం ఇంతకంటే మెరుగైన నాణ్యతను ఆశిస్తున్నాం" అంటూ ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా రంగు మారిన బంతి, సాంకేతిక లోపాలతో పీఎస్ఎల్ ఆరంభం అపశ్రుతులతో మొదలైంది.