Iran Army: మీ పిల్లలను నరకానికి పంపొద్దు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరిక!

Iran Warns America Israel Against Sending Soldiers to Their Death
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌పై భూతల దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) తీవ్రంగా హెచ్చరించింది. ‘‘మీ పిల్లలను, సైనికులను ఇరాన్ గడ్డపైకి పంపి వారిని బలి చేయవద్దు’’ అంటూ అత్యంత కఠినమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చింది.

ఇరాన్ సరిహద్దుల వద్ద అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భూతల దాడులకు సిద్ధమవుతున్నాయంటూ వస్తున్న నివేదికల నేపథ్యంలో ఐఆర్ జీసీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోకి అడుగుపెట్టే ఏ శత్రు సైనికుడైనా ప్రాణాలతో తిరిగి వెళ్లలేడని ఇరాన్ కమాండర్లు స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం లక్షలాది మంది సైనికులు, అత్యాధునిక క్షిపణులు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది.

తమను తాము రక్షించుకోవడమే కాకుండా, శత్రువుల స్థావరాలపై ఎదురుదాడి చేసే సామర్థ్యం కూడా తమకుందని ఇరాన్ పేర్కొంది. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాదని, మొత్తం పశ్చిమాసియాకు వ్యాపిస్తుందని హెచ్చరించింది.

అంతేకాకుండా, శత్రు దేశాల ప్రజలలో భయాందోళనలు సృష్టించేందుకు ఇరాన్ మానసిక యుద్ధానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ‘‘యుద్ధానికి మీ పిల్లలను పంపి అనవసరంగా చంపించవద్దు’’ అనే నినాదాన్ని ఇరాన్ సైన్యం విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.
Go Back to Shorts
Iran Army
Iran
America
Israel
Islamic Revolutionary Guard Corps
IRGC
Middle East Conflict
Military Threat
Geopolitical Tension
War Warning

More Telugu News