Iran: అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ చెక్.. మా షరతులు ఒప్పుకుంటేనే శాంతి!

Iran Rejects US Ceasefire Proposal Demands Conditions for Peace
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేసిన దౌత్యపరమైన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల విరమణ కోసం అమెరికా పంపిన 15 సూత్రాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. తమ షరతులు నెరవేరేంత వరకు దాడులను కొనసాగిస్తామని, యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో తామే నిర్ణయించుకుంటామని తేల్చిచెప్పింది.

అమెరికా తన కాల్పుల విరమణ ప్రణాళికను పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు చేరవేసింది. ఈజిప్టు కూడా ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాలుపంచుకుంది. అయితే, ఈ ప్లాన్‌ను స్వీకరించిన అనంతరం ఇరాన్ తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదన మోసపూరితంగా, తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉందని ఓ సీనియర్ ఇరాన్ అధికారి పేర్కొన్నట్లు అక్కడి అధికారిక మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.

‘మా షరతులు నెరవేరినప్పుడు, మేం నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఈ యుద్ధం ముగుస్తుంది. అంతేకానీ అమెరికా కోరుకున్నప్పుడు కాదు’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. అంతేకాదు, యుద్ధ విరమణకు ఇరాన్ సొంతంగా ఐదు షరతులను ప్రతిపాదించింది. తమపై దాడులు, హత్యలు పూర్తిగా ఆపాలని, భవిష్యత్తులో ఇలాంటి యుద్ధం పునరావృతం కాకుండా హామీ ఇవ్వాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని డిమాండ్ చేసింది. ఈ దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ, దాడులను ఆపేది లేదని ఇరాన్ తన చర్యల ద్వారా స్పష్టం చేస్తోంది.
Go Back to Shorts
Iran
Iran US relations
US Iran conflict
Middle East tensions
Ceasefire proposal
Hormuz Strait
West Asia crisis
Iran conditions
Pakistan
Egypt

More Telugu News