Britain: గల్ఫ్‌లో కీలక పరిణామం.. అణు సబ్‌మెరైన్‌ను మోహరించిన బ్రిటన్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ తన అత్యంత శక్తిమంతమైన అణు జలాంతర్గామిని అరేబియా సముద్రంలో మోహరించింది. ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ జలాల్లో ప్రయాణించే తమ వాణిజ్య నౌకల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ స్పష్టం చేసింది.
బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఈ జలాంతర్గామిలో 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల 'తొమహాక్' క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. శత్రువుల కంట పడకుండా నీటి అడుగు నుంచి దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ చర్య ద్వారా తన మిత్రదేశమైన అమెరికాకు మద్దతు తెలపడంతో పాటు, ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని యూకే భావిస్తోంది. హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం వంటి కీలక వాణిజ్య మార్గాల్లో నౌకాయానానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడటమే తమ ఉద్దేశమని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, బ్రిటన్ చర్యపై ఇరాన్, రష్యాలు తీవ్రంగా స్పందించాయి. తమ జలాల్లోకి విదేశీ శక్తులు ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇది యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టే చర్య అని, ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని రష్యా విమర్శించింది.