Bilkis Bano: బిల్కిస్ కేసులో మరో మలుపు.. విడుదల కోసం దోషుల కొత్త పిటిషన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులు తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు పడిన సంగతి తెలిసిందే. అయితే, గుజరాత్ ప్రభుత్వం 2022లో వీరిని విడుదల చేయగా, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో రద్దు చేసింది. కోర్టు ఆదేశాలతో దోషులంతా తిరిగి జైలుకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో, తమను విడుదల చేసే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని దోషులు తాజాగా వాదిస్తున్నారు. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున, అక్కడి ప్రభుత్వమే తమ రెమిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. తాము సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించామని, జైలులో తమ ప్రవర్తన బాగుందని పేర్కొన్నారు.
దోషుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం, ఇరు రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది.