స్పీకర్ జడ్జిమెంట్‌ను ప్రశ్నించిన కేటీఆర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Telangana
Advertisement
  • సభాపతి జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రశ్నించడం సరికాదన్న మంత్రి
  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్న
  • బీఆర్ఎస్ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిందన్న మంత్రి
Advertisement
స్పీకర్ జడ్జిమెంట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించడం ఆయన అహంకారానికి నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శాసనసభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారని సభ దృష్టికి కేటీఆర్ తీసుకువచ్చారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, కేటీఆర్ జడ్జిమెంట్ కాపీని పూర్తిగా చదివి మాట్లాడాలని సూచించారు.

ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సభాపతి జడ్జిమెంట్‌ను కేటీఆర్ ప్రశ్నించడం సరికాదని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేసే బీఆర్ఎస్ పార్టీ వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారని అన్నారు. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నాయకులు అని మంత్రి అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ponguleti Srinivas ReddyKTRBRSTelangana CongressSpeaker Gaddam Prasad KumarTelangana Politics

More Telugu News

భారతదేశంలోనే ‘మినీ ఇజ్రాయెల్‌’.. హిమాలయాల్లో దాగున్న ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

05 Nov, 11:45

పులివెందుల ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత

05 Nov, 11:42

అంతర్జాతీయ పరిణామాలతో దూసుకెళ్లిన పసిడి.. ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం

05 Nov, 11:41

ప్రవళిక మృతితో ఆర్టీసీ కీలక నిర్ణయం.. డోర్లు మూస్తేనే బస్సు ముందుకు!

05 Nov, 11:24

రామాయణం చివర్లో సన్నీ డియోల్ ఎంట్రీ... హనుమంతుడిగా అదుర్స్

05 Nov, 11:23

కూటమి బలాన్ని తట్టుకుని పోరాడాం: జీవీఎంసీ ఓటమిపై వరుదు కల్యాణి

05 Nov, 11:21

ఖాళీ గదిలో మాట్లాడితే శబ్దం ఎందుకు ఎక్కువగా వస్తుంది?.. సైన్స్ ఏం చెబుతోంది?

05 Nov, 11:20

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. సచిన్‌ ఏమన్నారంటే..!

05 Nov, 11:18

దలాల్ స్ట్రీట్‌కు దీపావళి కానుక.. అమెరికా ఫలితాలతో రూ. 7 లక్షల కోట్ల సంపద!

05 Nov, 11:16

94 శాతం స్ట్రైక్‌రేట్‌ను దాటాలి.. పరిషత్ ఎన్నికలకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్

05 Nov, 11:15

మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి: మంత్రి బాల వీరాంజనేయస్వామి

05 Nov, 11:14

అమెరికాతో డీల్‌పై భారత్‌ ఆచితూచి అడుగులు.. కలిసిరానున్న ఎన్నికల ఫలితాలు!

05 Nov, 11:09

ఉద్రిక్తతల మధ్య భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్

05 Nov, 11:07

ఇరాన్‌తో యుద్ధం చేద్దామా? వద్దా?.. డైలమాలో ట్రంప్

05 Nov, 11:06

రూపాయికి రెక్కలు, చమురుకు బ్రేకులు.. అమెరికా ఎన్నికల ఫలితాలతో భారత్‌కు ఊరట!

05 Nov, 11:01
..More Telugu News