ప్రత్యేక విమానంలో కొచ్చి నుంచి బయలుదేరిన 100 మంది ఇరాన్ నావికులు
సాంకేతిక సమస్య కారణంగా కొచ్చి తీరంలో నిలిచిపోయిన ఇరాన్ నౌక ఐరిస్ లావన్‌కు చెందిన సుమారు 100 మంది సిబ్బంది భారత్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నావికులు వెళ్లినట్లు అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
183 మంది నావికులతో బయలుదేరిన ఐరిస్ లావన్ నౌకలో సమస్య రావడంతో కొచ్చి తీరంలో నిలిపేందుకు ఇరాన్ అనుమతి కోరగా, భారత్ అంగీకరించింది. దీనితో ఈ నౌక దాదాపు పది రోజులుగా కొచ్చి తీరంలో ఉంటోంది. నౌకలోని సిబ్బంది అక్కడే ఉంటున్నారు. అయితే వీరిలో కొంతమంది శుక్రవారం రాత్రి విమానంలో వెళ్లిపోయారు. నావికులతో పాటు వేర్వేరు కారణాల వల్ల భారత్‌లో చిక్కుకున్న సుమారు 30 మంది ఇరానీ పౌరులు కూడా ఆ ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. ఈ విమానం అర్మేనియా వెళ్లినట్లు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం, ఇరానియన్ సిబ్బంది కొలంబో నుంచి కొచ్చి చేరుకున్న విమానంలో ఎక్కారు. శుక్రవారం రాత్రి ఈ విమానం ఆలస్యంగా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఈ విమానం అర్మేనియా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ఆ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. యుద్ధ నౌక మిగిలిన సిబ్బందితో కొచ్చిలోనే ఉంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ నావికుల తరలింపుకు సంబంధించి మీడియాకు కానీ, ప్రజలకు కానీ సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా, ఐరిస్ దేనా అనే ఇరాన్ నౌకను శ్రీలంక జలాల్లో అమెరికా జలాంతర్గామి పేల్చివేసిన విషయం తెలిసిందే. ఇరాన్ కే చెందిన ఐరిస్ లావన్ సాంకేతిక సమస్యల కారణంగా కొచ్చిలో నిలిపారు.