Bandi Sanjay: కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు 10 వేల మందితో పాదయాత్రను ప్రారంభించిన బండి సంజయ్

Bandi Sanjay Anjanna Ashirvada Yatra Begins from Karimnagar to Kondagattu

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మొక్కును తీర్చుకునేందుకు కరీంనగర్ నుండి కొండగట్టు వరకు 'అంజన్న ఆశీర్వాద యాత్ర' పేరిట పాదయాత్రను చేపట్టారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే నూతన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టుకు కాలినడకన వస్తానని ఆయన గతంలో ప్రకటించారు. ఆ మాట ప్రకారం, కరీంనగర్ మేయర్ పీఠం దక్కడంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.


కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ఆయన వెంట కరీంనగర్ నూతన మేయర్, కార్పొరేటర్లు, సుమారు 10 వేల మంది కార్యకర్తలు పాల్గొని అంజన్న నామస్మరణతో ముందుకు సాగుతున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులందరినీ ఏకం చేస్తూ, విజయానికి కృతజ్ఞతగా ఈ మొక్కును చెల్లించుకుంటున్నారు.

Bandi Sanjay
Karimnagar
Kondagattu
Padayatra
Anjanna Ashirvada Yatra
BJP
Mayor Election
Telangana Politics
Hindu Temple
Political Rally

More Telugu News