Ajith: సినీ నటుడు అజిత్‌కు కారును బహూకరించిన మహీంద్రా సంస్థ
ప్రముఖ సినీ నటుడు అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్‌యూవీని చెన్నైలో బహూకరించింది. ఇటీవలే అజిత్ దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చారు. ఆయనకు మహేంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ ఆర్.వేలుసామి ఈ కారును అందించారు.
అజిత్ ప్రొఫెషనల్ రేసర్ అనే విషయం తెలిసిందే. ఆయనకు రేసింగ్ పట్ల ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ ఈ కారును అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఇటీవల ఆయన ఎక్కువగా దుబాయ్‌లోనే ఉంటున్నారు.