పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. గ్యాస్ గోడౌన్ల వద్ద బారులు
- వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా నగరాల్లో పలు హోటళ్ల మూసివేత
- గృహ వినియోగదారులకు కూడా వంట గ్యాస్ ఇబ్బందులు
- మూడు రోజుల క్రితం బుక్ చేసినా సిలిండర్లు రావడం లేదని ఆవేదన
వంట గ్యాస్ ఇళ్ల వరకు రావడానికి రోజుల సమయం పడుతుండటంతో వినియోగదారులు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ గోడౌన్ల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో, జనగాం జిల్లా రఘునాథపల్లిలో వంట గ్యాస్ కోసం ప్రజలు సిలిండర్లతో బారులు తీరారు. మూడు రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాలేదని వరుసలో నిలబడిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.