Revanth Reddy: లారీలో 100 కిలోమీటర్ల దూరంలోని కర్నూలు వెళ్లి మొదటిరోజునే సినిమా చూసేవాళ్లం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Watched Movies in Kurnool During School Days
  • అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్య
  • తన చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకున్న ముఖ్యమంత్రి
  • సంవత్సరానికి 15 సినిమాలు చేసే హీరోల స్థాయి నుంచి ఐదేళ్లకు ఒక సినిమా చేసే హీరోలను చూస్తున్నామన్న సీఎం
  • అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలని ఆకాంక్షించిన సీఎం
తాను వనపర్తిలో చదువుకునే సమయంలో సినిమాలు చూడటానికి లారీలో 100 కిలోమీటర్ల దూరంలోని కర్నూలుకు వెళ్లి సెకండ్ షో చూసి వచ్చేవాళ్లమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రోజుల్లో హైదరాబాద్ లేదా కర్నూలు వంటి నగరాల్లో మాత్రమే సినిమాలు విడుదలయ్యేవని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. వనపర్తి వంటి పట్టణాల్లో సినిమాలు విడుదలయ్యేవి కాదని, కాబట్టి మొదటి రోజునే సినిమా చూసేందుకు లారీల్లో కర్నూలు వెళ్లేవాళ్లమని అన్నారు.

హైదరాబాద్‌లో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను కృష్ణ అభిమానిని అని తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ ఒక సంవత్సరంలో 15 నుంచి 16 సినిమాల్లో నటించిన రోజుల నుంచి ఈరోజుల్లో ఐదారేళ్లకు ఒక సినిమాలో నటించే హీరోలను చూస్తున్నామని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కోలీవుడ్ లేదా బాలీవుడ్‌తో పోటీపడకుండా, హాలీవుడ్‌తో పోటీ పడాలని అన్నారు.

హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సాంకేతికంగా మన హాలీవుడ్‌తో పోటీపడాలని అన్నారు. అల్లు అరవింద్ ఎదిగిన తీరును చూసి స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య మనసు ఉప్పొంగిపోతుందని అన్నారు.
Revanth Reddy
Telangana CM
Kurnool
Telugu Cinema
Allu Arjun
Allu Aravind
Super Star Krishna

More Telugu News