Abhishek Sharma: ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీలో సందడి చేసిన క్రికెటర్ అభిషేక్ శర్మ

Abhishek Sharma Celebrates at France Embassy in Delhi
  • టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా 
  • అభిషేక్ శర్మను ఆహ్వానించిన ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం 
  • అభిషేక్‌కు, టీమిండియాకు ఫ్రాన్స్ అభినందనలు
  • రాబోయే ఐపీఎల్ సీజన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంబసీ
టీమిండియా యంగ్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో సందడి చేశాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026 టోర్నీలో చారిత్రక విజయం సాధించిన భారత జట్టులో అభిషేక్ కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాయబార కార్యాలయం అతడిని ప్రత్యేకంగా ఆహ్వానించింది.

వరల్డ్ కప్ గెలిచినందుకు అభిషేక్ శర్మకు, టీమిండియాకు ఫ్రాన్స్ ఎంబసీ అధికారులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయం సాధించిన అభిషేక్‌ను తమ కార్యాలయానికి స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అభిషేక్‌తో కాసేపు ముచ్చటించిన అధికారులు, రాబోయే ఐపీఎల్ సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఫ్రాన్స్ ఎంబసీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Abhishek Sharma
Abhishek Sharma France Embassy
T20 World Cup 2026
Team India
France Embassy Delhi
IPL Season
Cricket
Indian Cricket Team

More Telugu News