Donald Trump: ఇరాన్‌పై దాడులతోనే చమురు ధరలు తగ్గుతాయి: డొనాల్డ్ ట్రంప్
- ఇరాన్‌పై సైనిక చర్యతో చమురు ధరలు తగ్గుతాయన్న డొనాల్డ్ ట్రంప్
- ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశామని వెల్లడి
- ఇరాన్ వాయుసేన, రాడార్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వ్యాఖ్య
- వ్యూహాత్మక నిల్వల నుంచి 40 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల చేస్తామని ప్రకటన
- లక్ష్యాలు పూర్తయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టీకరణ
ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య కారణంగానే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వ్యూహాత్మక నిల్వల నుంచి అత్యవసరంగా ముడిచమురును విడుదల చేయడం, టెహ్రాన్‌పై ఒత్తిడి కొనసాగించడం ద్వారా ఇంధన మార్కెట్లు స్థిరపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కెంటకీలోని హెబ్రాన్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌లోని ఉగ్రవాద పాలన నుంచి ముప్పును నివారించేందుకే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' చేపట్టామని, ఈ ఆపరేషన్ విజయవంతమైందని ట్రంప్ తెలిపారు. గత 11 రోజులుగా అమెరికా దళాలు ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ నష్టం కలిగించాయని చెప్పారు. "మా సైన్యం ఇరాన్‌ను దాదాపుగా నాశనం చేసింది" అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వైమానిక దళం పూర్తిగా ధ్వంసమైందని, ఆ దేశంలో రాడార్, విమాన విధ్వంసక వ్యవస్థలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం 90 శాతం, డ్రోన్ల సామర్థ్యం 85 శాతం తగ్గిపోయిందని ఆయన వివరించారు.
ఈ సైనిక చర్యలతో పాటు, ఇంధన మార్కెట్లను రక్షించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో 40 కోట్ల బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి అంగీకరించిందని తెలిపారు. దీనివల్ల చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.