Iran: అమెరికా మిత్ర దేశాల్లోని టెక్ స్థావరాలను లక్ష్యంగా చేసుకోనున్న ఇరాన్
- అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఐఆర్జీసీ నిర్ణయం
- టెక్ సంస్థల సాంకేతికతను ఉపయోగిస్తున్నందున వీటిని లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్
- గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్‌విడియా, ఒరాకిల్, పాలంటీర్ వంటి సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడి కోసం ఈ సంస్థల సాంకేతికతను ఉపయోగిస్తున్నందున వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ అనుబంధ వార్తా సంస్థ తస్నిం న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్‌విడియా, ఒరాకిల్, పాలంటీర్ వంటి టెక్ సంస్థలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు సంబంధించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. ఇందుకోసం శత్రువులు తమకు స్వేచ్ఛ కల్పించారని అన్నారు. ఆయా ప్రదేశాలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండవద్దని ఇరాన్ హెచ్చరించింది.