Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీని వీడే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి

Jeevan Reddy Key Comments on Leaving Congress Party
  • జీవన్ రెడ్డి పార్టీని వీడుతున్నారంటూ వార్తలు
  • ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న జీవన్ రెడ్డి
  • అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడి

జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ మారుతున్నారనే వార్తలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈరోజు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కలకలం రేపుతున్నాయి.


బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పార్టీలో, ప్రభుత్వ ప్రోటోకాల్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమని ఆయన గతంలోనే నేరుగా ఆరోపించారు. 'ఇంకెంత కాలం ఈ అవమానాలు భరించాలి?' అని ప్రశ్నిస్తూ, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ లో కొనసాగాలా? వద్దా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని... తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఏదైనా మీకు చెప్పే చేస్తానని మీడియాను ఉద్దేశించి అన్నారు.

Jeevan Reddy
Jagtial
Telangana Congress
Sanjay Kumar
BRS
Municipal Elections
Party Change
Telangana Politics
Congress Rebels

More Telugu News