Revanth Reddy: అందుకే ఢిల్లీ కాలుష్యాన్ని, బెంగళూరు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి: రేవంత్ రెడ్డి

Revanth Reddy says lack of vision caused Delhi pollution Bangalore traffic
  • పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్న సీఎం
  • కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్ గ్రేడ్ కావాలన్న ముఖ్యమంత్రి
  • సమస్యను బాగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లే అన్న సీఎం
దేశ రాజధాని ఢిల్లీ అత్యంత తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటోందని, బెంగళూరును ట్రాఫిక్ సమస్య వేధిస్తోందని, ముంబై, చెన్నై నగరాలు వరద సమస్యలను చూస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే పోలీసు శాఖకు గౌరవం పెరుగుతుందని అన్నారు. కొత్త కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతున్నాయని, ఇవి పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్ గ్రేడ్ కావాలని అన్నారు.

సమస్యను బాగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు బాగుండాలని అన్నారు. శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాలకే పెట్టుబడులు బాగా వస్తున్నాయని అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతం కాగా, జీడీపీలో మాత్రం 5 శాతం అందిస్తోందని అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరాలనేది తమ ఆశయమని అన్నారు.
Revanth Reddy
Telangana
Delhi pollution
Bangalore traffic
Mumbai floods
Chennai floods
Police department

More Telugu News