పవన్ బాబాయ్‌లో ఆ కోణం చాలామందికి తెలియదు: సుస్మిత కొణిదెల

Entertainment
Advertisement
  • బాబాయ్ పవన్ కల్యాణ్‌తో అనుబంధంపై మాట్లాడిన సుస్మిత కొణిదెల
  • చిన్నప్పుడు త‌మ‌కు హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్ సంగీతం పరిచయం చేసింది ఆయ‌నేనన్న ‌సుస్మిత
  • రాత్రిపూట రామ్ చరణ్‌తో పాటు మాకు దెయ్యం కథలు చెప్పేవారని వెల్లడి
  • పవన్ లో ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువని వ్యాఖ్య
Advertisement
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ఫ్యాషన్ డిజైనర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు నిర్మాతగానూ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్నారు. చిరంజీవితో "మన శంకర వరప్రసాద్ గారు" వంటి ప్రాజెక్టులతో నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల ఓ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన గురించి మాట్లాడారు.

పవన్ కల్యాణ్ తమకు కేవలం బాబాయ్ మాత్రమే కాదని, ఒక అన్నలా, స్నేహితుడిలా ఉండేవారని సుస్మిత గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు తమకు హాలీవుడ్ చిత్రాలపై ఆసక్తి కలిగించింది ఆయనేనని.. 'ది గాడ్‌ఫాదర్', 'స్టార్ వార్స్' వంటి క్లాసిక్ సినిమాలను పరిచయం చేశారని తెలిపారు. అంతేకాకుండా అప్పట్లో ఇంగ్లీష్ సంగీతాన్ని కూడా వినిపించి తమకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించారని ఆమె వివరించారు.

చిన్నప్పటి సరదా సంఘటనలను గుర్తుచేసుకుంటూ, రాత్రి సమయాల్లో పవన్ కల్యాణ్ తమ పిల్లలందరినీ కూర్చోబెట్టి హారర్ కథలు చెప్పేవారని సుస్మిత నవ్వుతూ చెప్పారు. "నన్ను, రామ్ చరణ్‌ను, ఇంట్లో ఉన్న ఇతర పిల్లలను కూర్చోబెట్టి బాబాయ్ దెయ్యం కథలు చెబుతుండేవారు. నాకు హారర్ కథలంటే ఇష్టం కావడంతో ఆసక్తిగా వినేదాన్ని. కానీ, మిగతా పిల్లలు మాత్రం భయంతో మధ్యలోనే కథల నుంచి లేచి వెళ్లిపోయేవారు" అని ఆమె అన్నారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఆయన ఏ వస్త్రధారణ ఎంచుకున్నా అది ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందని, ఆయన స్టైల్‌కు ప్రత్యేకమైన అభిమానులున్నారని సుస్మిత కొనియాడారు. అయితే, చాలామందికి తెలియని మరో కోణం ఆయనలో ఉందని, ఆయనలో ఆధ్యాత్మికత, తాత్విక చింతన చాలా ఎక్కువగా ఉంటాయని, ఆ విషయాలు తమను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం సుస్మిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబంతో ఆయనకున్న బలమైన బంధం గురించి తెలియడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Sushmitha KonidelaPawan KalyanChiranjeeviRam CharanJanasenaTollywoodTelugu cinemafamilyinterviewspiritual

More Telugu News

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌.. 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

05 Nov, 17:17

ఫలితాలు తేడాగా వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది: వల్లభనేని వంశీ

05 Nov, 17:11

గూగుల్‌ ఫొటోస్‌లో కీలక మార్పు.. డిలీట్‌ చేసిన ఫొటోలు 30 రోజులే!

05 Nov, 17:07

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30

కల్యాణదుర్గం ఎమ్మెల్యేపై దాడికి వైసీపీ యత్నం.. గన్‌మన్‌కు గాయాలు

05 Nov, 16:15

"సాయన్న పేరులోనే సాయముందిరా!".. పార్టీ సన్నాహక గీతం పంచుకున్న విజయసాయిరెడ్డి

05 Nov, 16:13

ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌.. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ బాటలో మెటా!

05 Nov, 16:13

సౌత్ నటిననే వివక్ష చూపారు: కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన ఆరోపణలు

05 Nov, 15:52

అయ్యప్ప సొసైటీపై సర్వే చేయాలి: రేవంత్ సర్కారుకు కవిత నెల రోజుల డెడ్‌లైన్

05 Nov, 15:48

ఐపీఎల్ ట్రేడింగ్: సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మెగా డీల్.. సగం ధరకే లివింగ్‌స్టోన్ చెన్నై గూటికి!

05 Nov, 15:43

బ్లింకిట్‌ అంబులెన్స్‌ బుకింగ్‌లో కొత్త రూల్‌.. అత్యవసరం కాని ప్రయాణానికి రూ.2,500!

05 Nov, 15:42

‘రామాయణ’ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటుతుంది: అట్లీ

05 Nov, 15:31

అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల లెక్క.. అరెస్ట్ పై పోలీసులకు సుప్రీంకోర్టు కీలక సూచన!

05 Nov, 15:26
..More Telugu News