Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయనున్న సీఎం
- కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్రబాబు
- స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఇవాళ ఉదయం 10:00 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి, 11:20 గంటలకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామానికి చేరుకుంటారు. ఉదయం 11:35 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అక్కడ నిర్వహించే గ్రామ సభలో, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు స్థానిక రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:40 గంటలకు టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. రోజంతా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:40 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.