Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే .. చరిత్ర సృష్టించనున్న లీసా గిల్

Justice Lisa Gill Appointed First Woman Chief Justice of AP High Court
  • పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి ఆమె బదిలీకి కేంద్రం ఆమోదం
  • ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్‌లో పదవీ విరమణ
  • ముందుగా న్యాయమూర్తిగా చేరి, ఆ తర్వాత సీజేగా బాధ్యతలు స్వీకరించనున్న లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. జస్టిస్ లీసా గిల్ తొలుత ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి, జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం ఆమె ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపడతారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించనున్నారు. 2014 నుంచి ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.
Justice Lisa Gill
AP High Court
Andhra Pradesh High Court
Chief Justice
First Woman CJ
Justice Dhiraj Singh Thakur
Punjab Haryana High Court
Supreme Court Collegium
High Court Transfer

More Telugu News