బొత్సకు మళ్లీ అస్వస్థత... పరిస్థితి గమనించి సూచన చేసిన పయ్యావుల

Andhra
Advertisement
  • శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత
  • విషయం గమనించి విశ్రాంతి తీసుకోవాలన్న మంత్రి పయ్యావుల
  • వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులు
  • బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఇబ్బంది పడ్డారని వెల్లడి
  • ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లు
Advertisement
వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.

బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ అధికారులు వెంటనే వైద్యులను మండలికి పిలిపించారు. అక్కడికి చేరుకున్న వైద్య బృందం అసెంబ్లీ ఆవరణలోని డిస్పెన్సరీలో బొత్సకు పలు రకాల పరీక్షలు నిర్వహించింది. రక్తపోటు (బీపీ)లో హెచ్చుతగ్గుల కారణంగానే బొత్స అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

అస్వస్థత నేపధ్యంలో అసెంబ్లీ వైద్యులు.. బొత్సకు రెగ్యులర్ గా చికిత్స అందించే స్పెషలిస్ట్ డాక్టర్లతోనూ మాట్లాడారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ముందస్తు జాగ్రత్తగా, మెరుగైన వైద్య చికిత్స కోసం బొత్సను హైదరాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే బొత్స అనారోగ్య సమస్యలతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
Advertisement

సంబంధిత వార్తలు

Botsa SatyanarayanaBotsa Satyanarayana healthPayyavula KeshavAndhra Pradesh AssemblyHealth issuesYSRCP leaderLegislative CouncilHyderabad hospitalBlood pressure

More Telugu News

కనిపించకుండా పోయిన చిలుక ఆచూకీ చెప్పండి.. లక్ష రివార్డ్ పొందండి!

05 Nov, 18:45

'హోం రాడికలైజేషన్'.. యువత తల్లిదండ్రులే ఉగ్రవాదుల కొత్త ఆయుధం!

05 Nov, 18:17

ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎల్లుండి కౌంటింగ్

05 Nov, 18:11

బీసీ సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆత్మగౌరవ భవనాలకు భారీగా నిధులు

05 Nov, 17:57

బాబర్ ఆజంతో ఇబ్బంది లేదు.. అతడి అభిమానులే విషపూరితం: అజామ్ ఖాన్

05 Nov, 17:50

కొఠియా గ్రామాల్లో ఓటర్లను అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్నింగ్

05 Nov, 17:20

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌.. 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

05 Nov, 17:17

ఫలితాలు తేడాగా వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది: వల్లభనేని వంశీ

05 Nov, 17:11

గూగుల్‌ ఫొటోస్‌లో కీలక మార్పు.. డిలీట్‌ చేసిన ఫొటోలు 30 రోజులే!

05 Nov, 17:07

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30

కల్యాణదుర్గం ఎమ్మెల్యేపై దాడికి వైసీపీ యత్నం.. గన్‌మన్‌కు గాయాలు

05 Nov, 16:15

"సాయన్న పేరులోనే సాయముందిరా!".. పార్టీ సన్నాహక గీతం పంచుకున్న విజయసాయిరెడ్డి

05 Nov, 16:13

ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌.. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ బాటలో మెటా!

05 Nov, 16:13
..More Telugu News