అసభ్యకర కామెంట్లు.. సైబర్ క్రైమ్ పోలీసులకు రేణుదేశాయ్ ఫిర్యాదు
- సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన రేణుదేశాయ్
- కొంతమంది నెటిజన్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు
- ప్రధానంగా నాలుగు అకౌంట్లపై ఆధారాలతో ఫిర్యాదు చేసిన రేణుదేశాయ్
రేణుదేశాయ్ మహిళలు, చిన్నారులు, మూగజీవాల రక్షణపై తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో నిత్యం పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల శునకాల గురించి ఆమె కొన్నిరోజుల క్రితం పెట్టిన ప్రెస్మీట్పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వీధి కుక్కల దాడులపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు నెటిజన్లు హద్దుమీరారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.