టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమానా!

  • టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరనందుకు పాక్ ఆటగాళ్లకు జరిమానా
  • ఒక్కో క్రికెటర్‌కు రూ.16 లక్షలకు పైగా ఫైన్ విధించిన పీసీబీ
  • జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ కెప్టెన్లు
  • కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న సల్మాన్ అలీ ఆఘా అంటూ ప్రచారం
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు వైఫల్యం తీవ్ర పరిణామాలకు దారితీసింది. సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైనందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ ఆటగాళ్లపై భారీ జరిమానా విధించింది. ఒక్కో ఆటగాడికి 5 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు రూ. 16.28 లక్షలు) ఫైన్ వేసినట్లు పాక్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ తన కథనంలో వెల్లడించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

గ్రూప్ దశలో భారత్‌తో ఓటమి తర్వాతే బోర్డు అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సూపర్ 8 దశలో ఇంగ్లండ్‌తో ఓడి, శ్రీలంకపై నామమాత్రపు విజయం సాధించినా.. పాక్ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేకపోయింది. ఐసీసీ టోర్నమెంట్‌లో మరోసారి కీలక దశకు చేరడంలో విఫలమవడంపై పీసీబీ తీవ్ర అసంతృప్తితో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ప్రయాణం గెలుపుతో ముగిసినప్పటికీ, జట్టు మొత్తం ప్రదర్శనపై పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

జట్టు ఆటతీరుపై మాజీ కెప్టెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. "రెండేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్‌లో దేశం గర్వపడేలా ఆడటంలో మరోసారి విఫలమయ్యారు. ఇది చాలా నిరాశపరిచింది. ఆధునిక టీ20 క్రికెట్‌కు తగ్గట్టుగా పాక్ ఆటగాళ్లు మారలేకపోతున్నారు" అని మాజీ దిగ్గజం జావేద్ మియాందాద్ అన్నాడు. పీసీబీ తక్షణమే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. కొంతమంది ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు ఇచ్చినా విఫలమయ్యారని, ఇకనైనా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని మరో మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ హితవు పలికాడు.

అగ్రశ్రేణి జట్లను ఓడించనంత కాలం ఐసీసీ ఈవెంట్ గెలవలేమని, సెలక్షన్‌లో, మైదానంలో చాలా తప్పులు చేశామని మొయిన్ ఖాన్ విమర్శించాడు. ఈ వైఫల్యంతో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది వంటి సీనియర్ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పర్యటన ముగిశాక కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా తన పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మాజీ కోచ్ సక్లైన్ ముస్తాక్ తన అల్లుడైన షాదాబ్ ఖాన్‌ను వెనకేసుకొస్తూ.. వైఫల్యానికి హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌ను బాధ్యుడిని చేసే ప్రయత్నం చేయడం కూడా వివాదాస్పదమైంది.

More Telugu News