నా గురించి రకరకాలుగా మాట్లాడినవారు, నన్ను హింసించినవారు ఇప్పుడేం చెబుతారు?: కవిత

27-02-2026 Fri 12:52 | Telangana
Advertisement
  • ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు
  • న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదన్న కవిత
  • లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర అని మండిపాటు
  • రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఆరోపణ
  • తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన కవిత
Advertisement
ఢిల్లీ మద్యం విధానం కేసులో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు ఆమెతో పాటు కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసం వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"సత్యమేవ జయతే. మేము ముందు నుండి కూడా తెలంగాణ ప్రజలకు చెపుతున్నట్టుగానే కేసులోని అందరినీ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. న్యాయ వ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. రాజకీయ కక్షలో భాగంగా నాపై పెట్టిన కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నేను చెప్పాను. చెప్పిన విధంగానే ఈరోజు జరిగింది. లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్ర. రాజకీయ కారణాలతోనే నాపై కేసు పెట్టారు. కేసుని అడ్డం పెట్టుకుని నాపై రకరకాలుగా మాట్లాడినవారు, నన్ను హింసించినవారు ఇప్పుడు ఏం చెబుతారు?

నేను జైల్లో ఉన్నప్పుడు జాగృతి నేతలు, కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఢిల్లీలో కోర్టు హియరింగ్ ల సందర్భంగా సొంత డబ్బులు పెట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఎంతో మంది నాకు తెలుసు. వారందరినీ జీవితంలో మర్చిపోకుండా కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇస్తున్నా. నేను జైల్లో ఉన్న సమయంలో మా పిల్లలకు అండగా నిలబడ్డ.. ముఖ్యంగా మా అత్తామామయ్యల గారికి, మా మదర్ కి, ఫాదర్ కి, జాగృతి కుటుంబానికి, తెలంగాణ కుటుంబానికి ధన్యవాదాలు. నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు " అని అన్నారు.
Advertisement
Kalvakuntla KavithaDelhi Liquor ScamTelanganaBRSJagruthiDelhi Rouse Avenue CourtClean ChitPolitical Conspiracyসত্যমেব জয়তেLiquor Case

More Telugu News

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52
..more